బుల్ రంకెతో దద్దరిల్లిన దలాల్‌స్ట్రీట్.. 11 ఏళ్లలో బెస్ట్ మంత్ ఇదే!

దేశీ స్టాక్ మార్కెట్ దుమ్మురేపింది. దలాల్ స్ట్రీట్ దద్దరిల్లింది. బెంచ్‌మార్క్ సూచీలు గురువారం ర్యాలీ చేశాయి. కరోనా వైరస్‌కు మందు ప్రయోగాత్మక దశలో సానుకూల ఫలితాలనే అందించిందనే వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో మార్కెట్ పరుగులు పెట్టింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మరో రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించొచ్చనే అంచనాలు కూడా మార్కెట్ ర్యాలీకి దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు.

సెన్సెక్స్ 997 పాయింట్ల లాభంతో 33,718 పాయింట్ల వద్ద, నిఫ్టీ 307 పాయింట్ల లాభంతో 9860 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. మార్కెట్ ఒక నెలలో ఈ స్థాయిలో లాభపడటం 11 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.