మద్యం హోం డెలివరీ పేరుతో మోసం.. రూ.93,600 కోల్పోయిన

లాక్‌డౌన్ సమయంలోనై హైదరాబాద్‌లో సైబర్ నేరాలు పెరుగుపోతున్నాయి. మద్యం కోసం అలమటించే మందుబాబులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బగ్గా వైన్స్ పేరుతో ఆన్‌లైన్లో మద్యం సరఫరా చేస్తామని ప్రచారం చేస్తూ మందు ప్రియులను దోచుకుంటున్నారు. ఈ సైబర్‌ నేరగాళ్ల వలలో పడి గత వారం ఓ బాధితుడు రూ. 50 వేలు కోల్పోగా... మంగళవారం మరో వ్యక్తి ఏకంగా రూ. 93,600 పోగొట్టుకున్నారు. దీంతో బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మద్యం కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తుండగా బగ్గా వైన్స్‌ పేరుతో ఫేస్‌బుక్‌ పేజ్‌ కనిపించింది. అందులో 24 గంటలూ మద్యం డోర్‌ డెలివరీ అంటూ కొన్ని ఫోన్‌ నంబర్లు కనిపించాయి. ఆ వ్యక్తి ఆ నంబర్‌కు ఫోన్ చేయగా ఏ బ్రాండ్లు కావాలంటూ అవతలి నుంచి అడిగారు.