అపర కుబేరుడు.. ఆసియాలోనే అత్యంత ధనవండుతు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్.. ముకేశ్ అంబానీకి కూడా కష్టాలొచ్చాయి. కరోనా వైరస్ దెబ్బకి జీతంలో కోతకు సిద్ధమయ్యారు. కోవిడ్ 19 వల్ల నష్టాలు సంభవించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల వేతనాల్లో కోతకు రెడీ అయ్యింది. ఇందుకు ముకేశ్ అంబానీ కూడా మినహాయిపేమీ కాదు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఇతర సీనియర్ లీడర్లు సహా కంపెనీ బోర్డు డైరెక్టర్లు అందరికీ శాలరీలో కోత ఉంటుంది. వీరికి 30 నుంచి 50 శాతం వరకు కోత తప్పదు. ముకేశ్ అంబానీ అయితే మొత్తం వేతనాన్ని వదులుకోనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోనే హైడ్రోకార్బన్ బిజినెస్‌లోని ఉద్యోగుల్లో రూ.15 లక్షలకు పైగా వేతనం అందుకుంటున్న వారికి స్థిర వేతనంలో 10 శాతం కోత ఉంటుంది. అదే రూ.15 లక్షలలోపు వేతనం ఉంటే ఎలాంటి కోత ఉండదు.
కరోనా ఎఫెక్ట్.. ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం!